Swara Madhuri
(స్వరమాధురి)

 

నెల నెల వెన్నెల పేరుతో మన హ్యూస్టన్‌ నగరం లో  2009 నుంచి జరుగుతున్న సాహితి  కార్యక్రమాలు మీ అందరికి తెలిసే ఉంటుంది. సంగీ్తాభిమానుల కోసం ఏదైనా ప్రత్యేక కార్యక్రమం మొదలెడితే  బాగుంటుంది అని వెన్నెల సభ్యులం కొందరం అనుకున్నాం.

అయితే కార్యక్రమం ఎలా వుండాలి, ఎలా ప్రారంభించాలి, ఎలా జరపాలి, ఏ ఏ అంశాలు వుండాలి అనే  విషయం మీద కొంత చర్చ జరిగింది.  గురువు గారు వంగూరి చిట్టెంరాజు  గారి సలహాతొ కార్యక్రమానికి ”స్వర మాధురి” అనే నామకరణం చేసాం. అలా  శాస్త్రీయ,  లలిత, జానపద, సినిమా సంగీతం తో కూడిన మన స్వర మాధురి కార్యక్రమం రూపు దాల్చింది.

రెండు లేదా మూడు నెలలకు ఒక సారి అందరం కలిసి సరదాగ కబుర్లు చెప్పుకుని, ఒక రెండు గంటల పాటు వీనుల విందైన సంగీతాని ఆస్వాదించడం కార్యక్రమ లక్ష్యం.

వయస్సుతో నిమిత్తం  లేకుండా, వర్ధమాన, ఔత్సహిక గాయనీ గాయకులకు ఒక వేదిక కల్పించడం, కేవలం వంటింటికో లేక స్నానాలగది కో పరిమితమైన కూని రాగాలని  ప్రోత్సాహించి వారిలో ఉన్న ప్రతిభను  నలుగురికి  పరిచయం చేయడం స్వరమాధురి ప్రధానోద్దెశ్యం

అనుకుందే తడవుగా 2009 నవంబర్‌ 28 న  తెలుగు  సాంస్కృతిక సమితి వారి సహకారం తో, వారి సాహచర్యం తో మొదటి స్వరమధురి కార్యక్రమం తలపెట్టాం. అంజలి సెంటర్లొ,  శ్రీమతి వైష్ణవి గొర్తి గారి లలిత గీతం తో  తొలి స్వరమధురి కార్యక్రమం ప్రారంభం అయింది. మొట్ట మొదటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులు అందరూ కార్యక్రమాన్ని చక్కగా ఆస్వాదించి తరువాతి స్వరమధురి కార్యక్రమాలకు దిశా నిర్దేసం చేసారు.  ఆ ఉత్సాహంతో ఇప్పటివరకు 6 స్వరమాధురి కార్యక్రమాలు విజయవంతం గా కొనసాగడానికి కారణం,వైవిధ్యమైన సంగీతం, ఎంతో ఉత్సహంగా పాల్గొనె గాయనీ గాయకులు, ప్రేక్షకుల    ఆర్ధిక సహయం,మన ”అంజలి సెంటర్‌” వేదిక. 

కార్యవర్గం, సభ్యులు లాంటి నియమాలు లేకుండా  ఎప్పటికి అప్పుడు విశేషమైన  అంశాలతో స్వరమాధురి కార్యక్రమం లో పాల్గొనే గాయనీ గాయకులే ఆ కార్య క్రమం రూప కర్తలు కావడం స్వరమాధురి ప్రత్యేకత. ఒక స్వరమాధురి కార్యక్రమం జరిగేప్పుడె, తరువాతి కార్యక్రమం ఎప్పుడు, ఎలా చేద్దాం అని అందరం(ప్రేక్షకుల తో సహా) కలిసి నిర్ణయించుకుంటాం. నిర్ణయించిన ప్రకారంగా తరువాతి కార్యక్రమాన్ని నడిపిస్తాం. స్వర మాధురి కార్యక్రమాలు అన్నిటికి ప్రవేశం ఉచితం.

ఇప్పటివరకు జరిగిన స్వరమాధురి విశెషాలు 

 • నవంబర్‌ 28, 2009 – తొలి కార్యక్రమం

 • ఫిబ్రవరి 5, 2010

 • ఏప్రెల్‌ 23, 2010 – కాలిఫొర్నియా ఘంటసాల, శ్రీ ఈదూరి రాజు గారి

                                     ప్రత్యేక కార్యక్రమం

 • డిశెంబర్‌ 5, 2010 – మొదటి వార్షికోత్సవం గా - అమర గాయకుడు ఘంటసాల పుట్టినరోజు 

                                       సందర్భంగా 12 గంటలు నిర్విరామంగా పాటల కార్యక్రమం తో నివాళి  

                                                  (వేగెశ్న ఫౌండేషన్‌, తెలుగు సాంస్కృతిక సమితి సహకారం తో)

 • జూన్‌ 3,  - బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా ప్రత్యెక కార్యక్రమం

 • సెప్టెంబర్‌ 11, 2011 - కే.వి. మహాదేవన్‌ ప్రత్యేక కార్యక్రమం, కొన్ని దేశభక్తి గీతాలు

 • నవంబర్‌ 6, 2011 - ఇళయరాజ ప్రత్యేక కార్యక్రమం, కొన్ని జానపద గీతాలు

సినిమా పాటలు (ఆపాత మధుర గీతాలు, ఈ నాటి కొత్త గీతాలు), జానపద గీతాలు,
శాస్త్రీయ సంగీత కీర్తనలు,కృతులు, లలిత గీతాలు ఇలా ఒక చక్కటి మేళవింపుతో
హ్యూస్టన్‌ సంగీత ప్రియులను మన స్వరమాధురి అలరిస్తూ ఉంది. 

 స్వరమాధురి కార్యక్రమాలకు నిత్యం మాకు తోడ్పడుతున్న మా మతృ సంస్థ తెలుగు సాస్కృతిక సమితి, హ్యూస్టన్‌ వారికి,ఎప్పుడు వేదిక అడిగిన కాదనకుండా సహకరిస్తున్న అనిల్‌ కుమార్‌ గారికి, గాయనీ గాయకులను ఎంతో ప్రోత్సహిస్తున్న హ్యూస్టన్‌ నగర తెలుగు వారికి “మధురవాణి” ముఖంగా కృతజ్నతలు తెలుపుకుంటున్నాము.

స్వరమాధురి కార్యక్రమాలలొ క్రమం తప్పకుండా పాడుతున్నఆస్థాన యువ గాయనీ  గాయకులు  దేశం లొ జరిగిన ఎన్నో పాటల పోటీలలొ బహుమతులు గెల్చుకోవడం కొస మెరుపు.

మీకూ పాడాలని వుందా, నలుగురిలో పాడాలంటే సంకోచమా?? మీకు సరైన వేదిక మన స్వరమాధురి.. ఇక మీదే ఆలస్యం!!

 Flyer1

 

 

 

 

 

 

 

flyer2

 

 

 

 

About the Author