- ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖం ఎరుగదు.
- ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు.
- అంత్య నిష్టురం కంటే అది నిష్టురం మేలు.
- అన్నపు కొరవే గాని అక్షరపు కొరవ లేదు.
- ఆలస్యం అమృతం విషం.
- ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం.
- ఆరే దీపానికి వెలుగు ఎక్కువ.
- అగ్గి మీద గుగ్గిలం.
- ఆశ లావు పిక్క సన్నం
- అడగందే అమ్మైనా పెట్టదు.
- అడిగే వాడికి చెప్పేవాడు లోకువ.
- ఐశ్వర్యం వస్తే అర్ధ రాత్రి గొడుగు పట్టమనేవాడు.
- అందితే సిగ అందక పొతే కళ్ళు.
- అంగట్లో అన్ని ఉన్న , అల్లుడి నోట్లో శని
- అంతా మన మంచికే
- ఆరోగ్యమే మహాభాగ్యము
- ఆది లోనే హంస పాదు.
- అప్పు చేసి పప్పు కూడు.
- అప్పు తీర్చి అంగటనుండు
- బ్రతికుంటే బలుసాకు తినవచ్చు.
- భక్తీ లేని పూజ పత్రి చేటు.
- బూడిదలో పోసిన పన్నీరు.
- బోడి తలకు మోకాలికి ముడి
- చాప కింద నీరులా
- చచ్చినవాని కళ్ళు చారెడేసి
- చేతులు కాలినాక ఆకులూ పట్టుకున్నట్లు.
- చెవిటి వాడి చెవిలో శంఖం ఉదినట్లు .
- చినికి చినికి గాలివాన అయినట్లు.
- చెరపకురా చెడేవు.
- దొంగకు తెలు కుట్టినట్లు.
No Comments
Leave a Reply
You must be logged in to post a comment.